Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. కదులుతున్న బస్ కింద పడి అక్కడికక్కడే మరణించింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.