Russia-Ukrain: ఉక్రెయిన్‌లో మళ్ళీ దాడులు..లక్ష ఇళ్ళల్లో చీకటి
రష్యా ఇంకా ఉక్రెయిన్ మీ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా మరోసారి బీకరంగా దాడులను జరిపింది. దీంతో ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్ష ఇళ్ళు అంధకారంలో కూరుకుపోయాయి.
రష్యా ఇంకా ఉక్రెయిన్ మీ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా మరోసారి బీకరంగా దాడులను జరిపింది. దీంతో ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్ష ఇళ్ళు అంధకారంలో కూరుకుపోయాయి.
రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు.
ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను కీవ్ కు పంపించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బైడెన్ సర్కార్ భావిస్తోంది. ఏడాది చివర్లో అమెరికా సైన్యం కీవ్ వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.
రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. యూదుల ప్రార్థనా స్థలం, చర్చిపై దాడులకు తెగబడ్డారు. తుపాకీలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. చర్చి ఫాదర్ కూడా ఇందులో ఉన్నారు.
24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు.
రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపి జైలు సిబ్బందిని రక్షించారు.
జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు కాల్పుల విరమణ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని, నాటోలో కూడా ఉక్రెయిన్ చేరొద్దని షరతు పెట్టారు.