Road Accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి
అమెరికాలో టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లా నిడమనూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దపుర మండలం పుల్యతండాకు చెందిన వారిగా గుర్తించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు ఇసుక లారి ఢీ కున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడిక్కడే మృతు చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్ శివారులోని జాతీయ రహదారిపై బతుకమ్మల ఘాట్ వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటలకు కరీంనగర్ వైపు నుంచి హుజురాబాద్ వెళ్తున్న లారీని ఓ కారు అతివేగంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వెనెజులాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైవేపై వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
బరేలీలోని భోజిపురా హైవే పై పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు డంపర్ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.
ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 20 మంది దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 7గురు చనిపోగా ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.