తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం-రాహుల్ గాంధీ
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి కాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి విషయాలు ట్రెండింగ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి తనకు సూపర్ స్టార్ హీరో కృష్ణ అంటే ఇష్టం అని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.28 కి బదులుగా మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం చేయనున్నారు.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. రేపు జరగబోయే తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు. దాంతో పాటూ తర్వాత చేయాల్సిన పనుల గురించి కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు.
విద్యార్థి రాజకీయాల స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ రేవంత్ రెడ్డి క్రమక్రమంగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో ఆయన బీఏ తో డిగ్రీ పూర్తి చేశారు. అప్పుడే విద్యార్థి రాజకీయాలతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
'సీఎం'.. రాష్ట్రానికి అధినేత. ఈ స్థానం కోసం రాజకీయ హేమాహేమీలు తలపడతారు. కానీ, రేవంత్ రెడ్డి 17 ఏళ్లలోనే జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం పదవినే చేపట్టారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, టీపీసీసీ చీఫ్‌గా, ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్.