Hyderabad: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన!
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మిచౌంగ్ తుఫాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ...బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో మొత్తం 16 విమానాల దారి మళ్లించినట్లు ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఢిల్లీలో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం కొంతవరకు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్లో ఆదివారం అకాల వర్షాల కురవడంతో పిడుగులు పడి 20 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. 16 గంటల్లో 50-117 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వడగండ్ల వర్షాలు కురవండతో తీవ్రంగా పంటలు నష్టం జరిగింది.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురవడం వల్ల స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు తీరానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని అధికారులు వివరించారు.