Rahul: నేటి నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14న ఇంఫాల్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలో యాత్రకు మణిపూర్‌లో అనుమతిని నిరాకరించింది అక్కడి బీజేపీ సర్కార్. మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది.
జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14న ప్రారంభమై మార్చి 20 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ్ యాత్ర జరగనుంది. మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగనుంది.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తనకు మల్లకార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నుంచి అధికారిక సమాచారం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటో తెలుసా..ఆయన చేతి వంట. సోనియాకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ మార్మలాండ్ ని ఆయన స్వయంగా చేసి సోనియాకు కానుకగా అందించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెజ్లర్లను కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో రేజ్లర్లతో భేటీ అయ్యారు. రాహుల్ ఒక రెజ్లర్ కాబట్టి రోజువారీ మా కార్యకలాపాలను చూడటానికి వచ్చారు. తమతో పాటు రెజ్లింగ్ కూడా చేశారని బజరంగ్ పునియా తెలిపారు.
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.