BIG BREAKING : సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలు కామాంధులుగా మారారు. వృత్తి ధర్మాన్ని మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఇద్దరు పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో "ఐ లవ్ ముహమ్మద్" బ్యానర్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బరేలీ మరియు మౌ జిల్లాలలో జరిగిన ఘర్షణల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు 30 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు.
పేకాట ఒకరి ప్రాణం తీసింది. అయితే ఇది ఏదో గొడవ మూలంగా జరిగిన మృతి మాత్రం కాదు. పేకాట స్థావరపై పోలీసులు దాడి చేయడంతో భయంతో పారిపోతుండగా వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. రోడ్డుపై మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నరాత్రి కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు.లీలామహల్ జంక్షన్లో వెకిలి చేష్టలకు దిగారు. స్థానికులు వారిలో ముగ్గురిని పట్టుకుని రోడ్డుపైనే చావబాదారు.
డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన రెడీ అవుతున్నారు. తప్పుడు పనికి ఏకంగా మరుభూమిని పడగపాన్పుగా మార్చుకుంటున్నారంటే సమాజం ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉందని శ్మశానవాటికలోని రూమ్‌ను మహిళ ఎంచక్కా వ్యాపార కేంద్రంగా మార్చింది.
చర్లపల్లి డ్రగ్స్ ఫ్యాక్టరీ కేసులో రహస్యాలు బయటపెట్టడానికి పోలీసులు రజినీ కాంత్ కూలీ సినిమా రేంజ్లో సీక్రెట్ ఆపరేషన్ చేశారు. వాగ్దేవీ ల్యాబొరేటరీస్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు చేయగా.. డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడిన విషయం తెలిసిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోలీసులు రెచ్చిపోయారు. యువకులపై పిడిగుద్దులు గుద్దుతూ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం. కర్నూలు జిల్లాల్లో నిమజ్జన ఊరేగింపులో ఓ డీజే వ్యాన్ డ్రైవర్ల పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
నవరాత్రుల్లో గణనాథుని దర్శించుకోడానికి వచ్చిన మహిళా భక్తులను వేధించిన వారిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది. 9 రోజుల వ్యవధిలో మహిళలను వేధింపులకు గురి చేసిన 930 మంది ఆకతాయిల్ని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారి వివరాలను గురువారం వెల్లడించారు.