PM Modi : నేడు అయోధ్య కు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానా శ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానా శ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
భారత్-ఇటలీ మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కదలికను సులభతరం చేస్తుంది. మన విద్యార్థులు ఇటలీలో విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు పాటు అదనంగా ఉండొచ్చు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మోదీని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి మోదీకి నివేదిక ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
WFI మాజీ చీఫ్ భూషణ్‌పై ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినేశ్ తనకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు మోదీకి ఎమోషనల్ లెటర్ రాశారు. న్యాయం కోసం గళం విప్పితే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారని వాపోయారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ యూట్యూబ్ లో 20 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర క్రియేట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం.
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్ సన్నిహితుడైన సంజయ్ గెలవడంతో రెజర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు రెజ్లర్ బజరంగ పూనియా మోదీకి ట్వీట్ చేశారు. అంతేకాదు నేరుగా మోదీ ఇంటికి వెళ్లేందుకు పూనియ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ చెప్పారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్రపతి ధన్ కర్ ప్రవర్తన శైలిని అనుకరించిన వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. నేను 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అయితే వాటన్నింటినీ ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నా. ధన్ కర్ ను బాడీ షేమింగ్ చేయడం బాధకరమన్నారు.