AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్..
ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు.
ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన రోడ్ షో వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురానికి బయలుదేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు భారీగా రోడ్ షోకు తరలివస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లో చిత్రాడ గ్రామం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఆయన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులు పాల్గొననున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు.
పిఠాపురంపై ఎన్నికల అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్లయింగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జనసేన స్టిక్కర్ గుర్తు ఉన్న కారులో 17 గాజుగ్లాస్ పెట్టెలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కారుతో పాటు గాజుగ్లాస్ల పెట్టెలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు పిఠాపురం చేరుకున్నారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.