Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దివ్యాంగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీ/ఎస్టీ లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది.
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు హర్యానాలో నమోదైంది. రాష్ట్ర రవాణా శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో HR88B8888 నంబర్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. హర్యానా రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి వారం ఆన్లైన్లో వేలం నిర్వహిస్తుంది.
పథకాలలో మోసాలను అరికట్టడానికి, ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం క్లీన్-అప్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ భారతీయ మహిళని చైనాలోని షాంఘై విమానాశ్రయంలో నిర్బంధించిన ఘటన, ఆపై అరుణాచల్ తమ భూభాగమంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరానిదని పునరుద్ఘాటించింది.
2025 మార్చిలో భర్తని చంపి డ్రమ్‌లో పెట్టిన మీరల్ హత్య కేసు మళ్లీ వార్తళ్లోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు, భార్య ముస్కాన్ జైలు శిక్ష అనుభవిస్తూ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప ఆరేళ్ల వరకు తల్లితోపాటు జైళ్లోనే జీవితం గడపాలి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇకపై తెలుగువారు కూడా భారత రాజ్యాంగాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్‌గా విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా SIR ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన ఆధారాలు లభిస్తే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ గడువు పొడిగించాలని ECని ఆదేశిస్తామంది.