Chandrababu CID Interrogation: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజు మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.
స్టాన్పోర్డ్లో ఎంబీఏ చేశానని.. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన లోకేష్.. కేసులు పెడితేనో.. జైల్లో వేస్తేనో భయపడే వాళ్లం అస్సలు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సైకో జగన్ను శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతో తాము పని చేస్తామని చెప్పారు లోకేష్.
వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? లేదా అనేది పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.