ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్ తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandra babu Naidu: జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉంది..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు. By P. Sonika Chandra 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి నారా లోకేశ్, అయ్యన్న పాత్రుడికి క్యారెక్టర్ లేదు.... డిప్యూటీ సీఎం ఫైర్...! టీడీపీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని మండిడపడ్డారు. టీడీపీ నేతలంతా మానవత్వం లేని మనుషులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు, అయ్యన్న పాత్రుడికి అసలు క్యారెక్టర్ లేదంటూ మండిపడ్డారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రాణహాని ఉందని డీజీపీని కలిసిన పోసాని! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: గన్నవరంలో నారా లోకేశ్ బహిరంగ సభ.. భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు! చిన్నారి లక్షిత ప్రాణానికి రూ.10 లక్షలు రేటు కట్టారని జగన్‌పై మండి పడ్డారు లోకేశ్. టిటిడి ఛైర్మెన్ భూమన కరుణా కర్ర రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తాడట అంటూ సెటైర్లు వేశారు. ఒక ఛాలెంజ్ విసురుతున్నానని.. తాడేపల్లి ప్యాలస్‌లో పులిని వదులుతాం.. జగన్, కరుణా కర్ర రెడ్డి కర్రలతో పులిని తరమాలి? ఛాలెంజ్ కి సిద్ధమా అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. బహిరంగ సభలో ఆయన ప్రసంగించచారు. ఈ సభకు తెలుగు దేశం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఈ నెల 28 న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..ఎందుకంటే! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28 న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన పరిణామాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tension at Gannavaram: గన్నవరంలో టెన్షన్ వాతావరణం.. లోకేష్ పాదయాత్ర రూట్ మార్చిన పోలీసులు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao joins TDP: నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh Yuvagalam: యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత..ఇదే తొలిసారి! టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn