నేషనల్ అధికారం కోసం మణిపూర్లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీనామాకు ససేమిరా,మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. By M. Umakanth Rao 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ఆగని హింస బస్సులకు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు! మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn