Kannappa: ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్! ఎంత పెరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ. 50 పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజులు వరకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.
Manchu Vishnu: 'కన్నప్ప' టీమ్ పై ఐటీ సోదాలు! నాకేం తెలియదంటూ మంచు విష్ణు రిప్లై !
కన్నప్ప సినిమా యూనిట్‌పై, మంచు విష్ణుతో సహా పలువురి ఇళ్లపై జీఎస్టీ సోదాలు జరిగాయి. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ తమ ఆఫీసులపై సోదాలు చేస్తున్నట్టు తనకు తెలీదని, తాను 'కన్నప్ప' ప్రీమియర్ షోస్ హడావిడిలో ఉన్నానని తెలిపారు
Kannappa: ఎట్టకేలకు 'కన్నప్ప'కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్! ఎన్ని కట్స్ చెప్పిందంటే
మంచు విష్ణు 'కన్నప్ప' ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. 13 సన్నివేశాలు తొలగించిన తర్వాత సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. కట్స్ తర్వాత ఈ సినిమా మొత్తం రన్ టైం 3 గంటల 2 నిమిషాలుగా కుదించారు. 'కన్నప్ప' ఈనెల 27న విడుదల కానుంది.
Kannappa: కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Kannappa: కన్నప్ప సినిమాకు షాక్.. రిలీజ్‌కు బ్రేక్ !
కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించనున్నారు. దీంతో జూన్ 27న రిలీజ్ చేయాలనుకున్న సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
Kannappa: 'కన్నప్ప'.. ప్రభాస్ మేకింగ్ వీడియో చూశారా!
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో స్పెషల్ రోల్ పోషించిన ప్రభాస్ మేకింగ్ వీడియో బయటకొచ్చింది. శివ భక్తుడి వేషంలో అడవిలోనుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ డిఫరెంట్‌గా కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
Kannappa Trailer: మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ ! ఇక్కడ చూడండి
మంచు విష్ణు కన్నప్ప మూవీ ట్రైలర్ విడుదలైంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుండగా ఈ క్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. 'కన్నప్ప' పై మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నేపథ్యంలో మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. విమాన ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కుటుంబాలకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
/rtv/media/media_files/2025/06/27/kannappa-twitter-review-2025-06-27-06-41-33.jpg)
/rtv/media/media_files/2025/06/07/8DDJPk3M879eGccnWODE.jpg)
/rtv/media/media_files/2025/03/15/ThWujDBx2zStaRhDKQIf.jpg)
/rtv/media/media_files/2025/06/10/Q3NGdiXpykkp39GFqxMn.jpg)
/rtv/media/media_files/2025/06/15/f2BvQTnF2vgru6mTXfn2.jpg)
/rtv/media/media_files/2025/06/14/og6FZbcgYhLxINXKT9Ng.jpg)