Lift Accident: సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది.
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరవుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణలో రాబోయే 3రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ‘‘3రోజుల పాటు ఓ వైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.’’ అని తెలిపింది.
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గడువును పెంచింది. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25 నాటికి ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్’ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మే డే రోజున చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీసంపదను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.