Jubilee Hills By Elections: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముగ్గురి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవోపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.
వనపర్తి జిల్లా రెవల్లి మండలం నాగపూర్‌లో ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే ఆగ్రహంతో కోడలు తన వృద్ధ అత్తను కర్రతో కొట్టి చంపింది. మృతురాలు ఎల్లమ్మ (73)గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ సెలవుల తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో మెట్రో స్టేషన్లకు జనం పోటెత్తారు. ఎల్బీ నగర్ వంటి స్టేషన్లలో ఎస్కలేటర్లు పనిచేయక, ప్లాట్‌ఫారంకు చేరడానికి గంటల సమయం పట్టి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఓ ప్రశ్న తెలంగాణ ఆర్టీసీలో కీలక మార్పులకు దారితీసింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే సామాన్యులపై ఫైన్లు బాదుతారు. మరి RTC బస్సులో ఎన్ని సీట్లకు సీటు బెట్లులు ఉన్నాయని హైదరాబాద్ వ్యక్తి RTIతో ప్రశ్నించాడు. దీంతో RTC బస్సులో సీటు బెల్ట్ తప్పని సరి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా ఈరోజు విడుదల చేయనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల కమిషన్ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించనుంది.
ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సెల్ ఊచలు రంపంతో కోసి వారు తప్పించుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాబోయే 3 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.