BIG BREAKING: 15 మంది టూరిస్టులు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరిక్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దుధియా బ్రిడ్జ్ కూలిపోయింది.
భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా బుధవారం వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. గౌరీకుండ్ - చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు.
పసిఫిక్ ద్వీప దేశమైన పపువా గినిలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేసింది.
ఉత్తర పాపువా న్యూ గినియాలోని మారుమూల గ్రామాన్ని నేలమట్టం చేసిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రజలు , 1,100 ఇళ్లు సమాధి అయ్యాయని స్థానిక మీడియా శనివారం నివేదించింది.