ED on MLA KTR: కేటీఆర్‌పై కేసు?
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తోంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట కవితను ఈడీ హాజరుపరచనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారన్నారు. కారు కూతలు, చిల్లర మాటలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఎవరు మగాడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.
కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఐఐటి మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్ లో పాల్గొని కీలకోపన్యాసం చేయాలని కోరింది. తనకున్న అనుభవాన్ని భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కోరింది.
కేసీఆర్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అక్రమనిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత కొంత కాలంగా పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్,BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక, చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు.
గుజరాత్ మోడల్‌ను సీఎం రేవంత్ ప్రశంసించడంపై కేటీఆర్ మండిపడ్డారు. మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ అంటూ నిప్పులు చెరిగారు.