Australia : ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి!
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.
పెనమలూరు వైసీపీ టెకెట్ ను మంత్రి జోగిరమేష్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు..
ఆంధ్రపద్రేశ్లో నిషేధిత నత్తల పెంపకంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిషేధిత థాయిలాండ్ నత్తల పెంపకానికి సంబంధించి కేంద్ర అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో కలకలం రేపింది. నిషేధిత థాయ్లాండ్ నత్తల శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి.
నీళ్లు రాక బీడు భూములుగా మారిన తమ పంటపొలాల్లో బైక్ నడిపి నిరసన తెలిపారు రైతులు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కృష్ణా జిల్లా కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి తెగబడ్డాడు. రెండు రోజులు బందీలుగానే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా మోపిదేవి ఎస్ఐ కనీసం తమ గోడు వినడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దయనీయ స్థితిలో ఉన్నారు బాధితులు .
కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సార్ట్ కానుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో జనసేనాని దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ జనసైనికుల్లో జోష్ పెంచుతున్నారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.