CM Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్డేట్
కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
కర్ణాటకలో మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ శివకుమార్ గురించే మాట్లాడుతోందని తెలిపారు.
తమిళనాడు- కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది. కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు- 2025 అనే కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించనున్నారు.
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ స్క్రీనింగ్‌కు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కమల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. చుట్టుపక్కల వారు బాలుడి రక్షించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.