Apple సంస్థకు కాకినాడలో రూ.లక్ష జరిమానా.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. మొబైల్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే యాడ్‌తో ఓ యువకుడు మోసపోయాడని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేయగా.. దీనిపై కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
CM Chandrababu: నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
AP: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
AP News: ఏలేరు కాలువకు గండి.. డేంజర్ జోన్లో 86 గ్రామాలు!
కాకినాడ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం వల్ల రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. రాజుపాలెం కాలనీతోపాటు 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.
Kakinada: గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.... 20 మంది విద్యార్థులకు అస్వస్థత!
ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారణం అయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
AP : కువైట్‌లో చిక్కుకున్న మరో తెలుగు మహిళ.. !
కువైట్‌లో మరో తెలుగు మహిళ నాగమణి చిక్కుకుంది. యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానంటూ నాగమణి వీడియో విడుదల చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రోజూ నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
Kakinada: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోలేదని..ట్రైన్ కింద తలపెట్టి..!
ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. మృతున్నితుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను (22) గా గుర్తించారు.
AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్.. ఒక్క రాత్రికి రా అంటూ..
కాకినాడలో పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకుపై కలెక్టర్, పోలీసులకు పెళ్లి కూతురు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కృష్ణమోహన్ ఫోన్ చేసి ఒక్క రాత్రి ఒంటరిగా రావాలని బెదిరించాడని తెలిపింది. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని ఆరోపించింది.
AP: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి..
కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థుల తల్లి ఆరోపిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/iPhone-15-jpg.webp)
/rtv/media/media_files/M7jvquGxieqe4BSVdboj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Kakinada-district-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/poision.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lokesh-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kakinada-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kidnap.jpg)