YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన
హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
గొర్రెల కొనుగోలు పంచాయితీ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన నల్గొండ జిల్లా చెన్నంపేట ఎస్ఐ సతీష్‌తోపాటు సిబ్బందిపై వెఎస్ ఆర్ జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. తమ పార్టీ ప్లెక్సీలు చించివేయడంతో జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
కడపలో సీఐ అనిల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బలిజ సంఘం నేతలు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీఐ భార్య వెళ్లితే ఎస్పీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ భర్త ప్రాణం తీసింది. భర్త శివ శంకర్ రెడ్డిను హత్య చేసేందుకు భార్య ప్రేమ లీల ప్రియుడితో కలిసి స్కేచ్ వేసింది. ప్రేమ లీల వేసిన పథకాన్ని పసిగట్టిన శివశంకర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దొరసాని పల్లె సచివాలయంలో మహిళ సంరక్షణ అధికారిగా ప్రేమ లీల వర్క్ చేస్తుండగా ప్రియుడు అక్కడ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.
వైసీపీ ప్రభుత్వం కూతల, కోతల, వాతల ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి అన్నారు. ఒకవైపేమో కరెంట్ కోతలు, మరోవైపు విద్యుత్ బిల్లుల వాతలు ఎక్కువయ్యాయని చెప్పారు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- ఆటో రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగరికి గాయాలయ్యాయి.
ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించిన ఘటన మరువకముందే తాజాగా కడప జిల్లాలో ఓ ఎలుగు బంటి హల్చల్ చేసింది. కుక్కలు వెంటబడటంతో చెట్టెక్కి మరి ప్రాణాలు కాపాడుకుంది. ఎలుగుబంటి చూసి భయాందోళనకు గురైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది, పోలీసులు సమీపాన ఉన్న ఇళ్ళకు తాళాలు వేయించి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు.