Janasena in Telangana: జనసేనానికి అవమానమా? అనుభవమా? తెలంగాణలో ఏది మిగిలింది?
జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ పోటీచేసిన 8 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జనసేన పోటీపై విశ్లేషకులు ఏమంటున్నారో అర్ధం చేసుకుందాం
జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ పోటీచేసిన 8 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జనసేన పోటీపై విశ్లేషకులు ఏమంటున్నారో అర్ధం చేసుకుందాం
బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ కారణంగానే జనసేన బీజేపీకి మద్దతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణతో తనకు భావోద్వేగపరమైన అనుబంధం ఉందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు.
టీడీపీ-జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు ఎంత స్పీడ్‌గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన నేత పోతిన మహేష్. పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ కి వ్యతిరేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ నిర్మాణంతో చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు సూర్యాపేటలో జరిగిన పవన్ కల్యాణ్ మీటింగ్ కు బీజేపీ శ్రేణులతో పాటు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పూలు చల్లుతూ, కేరింతలు కొడుతూ, సీఎం.. సీఎం.. అంటూ రచ్చ రచ్చ చేశారు. పవన్ నోటి నుంచి గద్దర్ బండెనుక బండి పాట రావడంతో ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.
గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.
మంత్రి సజ్జల సమక్షంలో వైసిపి లో చేరారు జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి, ఆమె కుమారుడు సందీప్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అహంకారి అని..టిడిపి కోసమే పని చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు వరంగల్ లో ఎల్లుండి కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది.