Janasena: జనసేన పార్టీకి బిగ్ షాక్..!
గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.
గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.
మంత్రి సజ్జల సమక్షంలో వైసిపి లో చేరారు జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి, ఆమె కుమారుడు సందీప్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అహంకారి అని..టిడిపి కోసమే పని చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు వరంగల్ లో ఎల్లుండి కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ కు రాజకీయంగా సకల యోగాలు సిద్ధించాలని కోరుతూ మహా చండీ సహిత రాజ్యశ్యామల యాగంను జరిపించనున్నారు.
విశాఖ షిప్పింగ్ హార్బర్ ఘటన బాధితులకు జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. బోట్లు దగ్ధమై నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జనసేన తరుఫున బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పసుపులేటి హరిప్రసాద్, చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న విద్యాకానుక పథకంలో రూ.120 కోట్లు దారి మళ్లాయని జనసేన నేత నాదేండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 35 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. జగనన్న విద్యా కానుక కోసం 42 లక్షల ఆర్డర్లు ఇచ్చారన్నారు.
టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.