ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అనునిత్యం జనాల్లో ఉండేందుకు అన్ని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతి సందర్భంగా ఏపీ ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.
రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు...ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ జగన్ కోసం పనిచేస్తుంది. ఈ తరుణంలో చంద్రబాబుతో, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.