Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్ కల్యాణ్!
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.
వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం లోని జనుపల్లిలో ఆయన పర్యటిస్తారు.ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ చేరుకుంటారు.
టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే జగన్ కంటే మెరుగైన పాలన అందించారని నిరూపిస్తే.. ప్రజలతో చెప్పు దెబ్బలకు సిద్ధమని పోసాని సవాల్ విసిరారు. రాజకీయవేత్తగా కానీ, ఓ మనిషిగా కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునేషన్కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్ చేశారు