Mojtaba: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావణం నెలకొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మరోసారి చైనా ఉత్పత్తులు డమ్మీ అని ప్రూ అయింది. గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ప్రసిద్ధ ఎస్-300 వ్యవస్థ ఉండేది. అయితే, అమెరికా క్షిపణులను అడ్డుకోవడంలో అది విఫలం కావడంతో, ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపింది.
ఖమేనీ జీవితంలో ఇది మొదటి దాడి కాదు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1981లో ఆయనపై ఒకసారి భయంకరమైన హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వాడే చమురులో 20 శాతం ఈ జలసంధి నుంచే వెళ్తుంది. భారత్ ముడి చమురు అవసరాల్లో 90 శాతాన్ని మధ్యప్రాచ్యం నుంచే పొందుతోంది. అందులో 40 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పుడు ఇది మూతపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.