కేటీఆర్, హరీష్ పై బండి కామెంట్స్ | Bandi Sanjay Comments On KTR And Harish Rao | RTV
హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విడదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తోందని, పగ ప్రతీకారాలతో పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ సీఎంగా కాకుండా గల్లీ నాయకుడిలా పనిచేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై విషయంలోఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడమన్నారు. ప్రజా పాలనలో రాక్షస పాలన సాగుతుందని హరీష్ రావు మండిపడ్డారు.
మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్లులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తనమీద నమోదైన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని ఫిటిషన్ లో పేర్కొన్నారు.
లక్ష తప్పుడు కేసులు పెట్టిన తనను ఏమీ చేయలేరని హరీష్ రావు అన్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాలన్నీ బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు.