Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. VIDEO
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
యూపీలోని కాన్పుర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం సజీవదహనం అయింది. మృతుల్లో భర్త మహ్మద్ డానిశ్, భార్య నజ్నీన్ శభ, పెద్ద కుమార్తె సారా, మధ్య కుమార్తె సిమ్రా, చిన్న కుమార్తె ఇనయా ఉన్నారు.
సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ SBI బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్‌తో ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో బ్యాంకులోని కీలక ఫైల్స్ దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతుంది.
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 5కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
కోల్‌కతా రితురాజ్ హోటల్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగ్గా.. 14 మంది స్పాట్లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్‌లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి.
ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ మంటలు తక్కువ సమయంలోనే మరింత విస్తరించాయి.
హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్‌లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో 300 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.