Telangana: సంగారెడ్డిలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు
సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు
చైనాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అక్కడి దక్సిణ ప్రాంతాన్ని దడదడలాడించింది. దీంతో చైనాలో బీటలు వారాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసం అయింది. చైనా భూకంపం ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించడం కలకలం రేపింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్, నోయిడా, ఘజియాబాద్, ఫిరిదాబాద్,గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలౌట్ ఆపరేషన్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఫిలిప్పీన్స్‌లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.