Hema: జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ- VIDEO
బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిందంటూ వైరల్ అవుతున్న వార్తలను వరలక్ష్మి శరత్‌కుమార్ ఖండించారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి సమన్లు, ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు విలువైన జర్నలిజాన్ని కాపాడాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తుండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్ స్పందించారు. గత వారం రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో లవర్ లావణ్య పట్టుబడ్డారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించిన ఎస్వోటీ పోలీసులు.. ఆమె వద్ద 4గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. లావణ్య ప్రేమికుడైన ఆ హీరో ఎవరు? ఇందులో అతని పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో కొత్త కోణం మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియా (Social Media) ద్వారా డ్రగ్స్ విక్రయాల ఆర్డర్లను తీసుకుంటూ, డోర్ డెలివరీ చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ (Navadeep) ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 7 న విచారణకు హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ ముందు నవదీప్ హాజరయ్యారు.
మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్ మంగళవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అతను హైకోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అంతేకాదు 41ఏ కింద నవదీప్ కు నోటీసులివ్వాలని పోలీసులను ఆదేశించింది.
పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.