ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. బాలుడు మృతి
వరంగంలో కరెంట్ షాక్‌తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వరంగంలో కరెంట్ షాక్‌తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబ్బయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
డీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్ (84) HYD లో కన్ను మూశారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని అంటారు. వయో సంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
వయనాడ్‌లో ఇంకా విషాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతూనే ఉంది. ఇప్పటికి 200 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 130 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
రూ. 200 కోసం గొడవపడ్డ క్యాబ్ డ్రైవర్ జీవితం గాల్లో కలిసిపోయింది.రెండేళ్ల క్రితం వివేక్ అనే వ్యక్తి క్యాబ్ ఛార్జీ 900 అయితే 700 ఇవ్వగా అతనితో డ్రైవర్ వెంకటేశ్ గొడవపడ్డాడు.దీంతో వివేక్ అతని ఫ్రెండ్స్ వెంకటేశ్‌ని చితకబాదగా..అతను రెండేళ్లు కోమాలో ఉండి ఆదివారం చనిపోయాడు.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఈరోజు కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు గడించారు.
కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.
కేరళలోని వయనాడ్‌లో మృత్యుఘోష పెరుగుతోంది. అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి ఇప్పటికి 254 మంది చనిపోగా..ఇంకా 300 మంది ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది.