Crime: భార్యతో గొడవ.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఓ హోటల్ రూమ్‌లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కోపంలో తన ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపడం కలకలం రేపింది.
బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఓ హోటల్ రూమ్‌లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కోపంలో తన ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపడం కలకలం రేపింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని తమ్ముడు మోహన్ గతంలో ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇతనికి మంత్రాలు వస్తాయని కోపం హత్య చేసినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నవజాత చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు.
హర్యానాలోని బస్ బాద్‌షాహ్‌పూర్‌లో గురు పౌర్ణమి రోజూ విద్యార్థులు గురువునే హత్య చేశారు. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జగ్బీర్ సింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మాటలు నచ్చక ఇంత దారుణంగా హత్య చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటన మరొక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. యూపీకి చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్, విజయ్‌కుమార్ నిషాంత్ సిగాచీ ఇండస్ట్రీస్ ప్రమాదంలో జాడ దొరకలేదు. వీరి రాక కోసం ఎదురుచూసిన మేనత్త చివరికి ప్రాణాలు విడిచారు.
ఒడిశాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల వెండి బిస్కెట్లను ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.10 కోట్లు ఉంటుదని అంచనా వేస్తున్నారు. కారు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి బాత్రూమ్ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు.
సంగారెడ్డిలో స్కూల్ బస్సులో మంటలు కలకలం రేపింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు, టీచర్లను అప్రమత్తమై బస్సులో నుంచి కిందకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హైదరాాబాద్‌లో ఓ కూతురు తండ్రిని చంపింది. తన తల్లి, ప్రియుడు సాయంతో అతన్ని చంపి చెరువులో పడేసి, ఆ తర్వాత సెకండ్ షోకి వెళ్లారు. చెరువులో శవం కనిపించి విచారణ చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.