India-China: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. ఒక్కటైన భారత్-చైనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
టారీఫ్ ల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చైనా పర్యటన ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో ఆయన యూఎస్ కూడా వెళ్ళనున్నారని తెలుస్తోంది. అదనపు టారీఫ్ ల నేపథ్యంలో మోదీ పెద్ద ప్లానే వేశారని..దాని కోసమే ఈ పర్యటనలని అంటున్నారు.
ఇటీవల అమెరికా, చైనా టారిఫ్‌లు పెంచుకొని మళ్లీ తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు 90 రోజులు అమల్లో ఉండేలా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా ట్రంప్ ఈ ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా కవ్వింపులు ఆపడం లేదు. భారత సరిహద్దుల వెంట వరుసగా వివాదస్పద నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఇప్పటికే టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ నిర్మాణాన్ని చేపట్టింది.
చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. గాన్సు ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ వరదలకు ఇళ్లు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం.
ప్రధాని మోదీ ఆగస్టు చివర్లో చైనాకు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (SCO)లో పాల్గొనేందుకు రావాలని మోదీకి చైనా శుక్రవారం అధికారికంగా ఆహ్వానం పలికింది.
ఇండియా, అమెరికాలు ఇప్పుడు బద్ధ శత్రువులయ్యాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటుందనే ఆరోపణలతో అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీనిలో యూఎస్ కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా రష్యాతో పాటూ చైనాకు నిలుచనుంది. దీంతో అగ్రరాజ్యానికి మూడినట్టే అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.