Rain Alert:మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటనున్నట్లు వివరించారు.
చెన్నై నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడానికి , యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికి చెన్నై నగర పాలక సంస్థ ఓ చక్కటి పరిష్కారాన్ని అందించింది. రహదారి పై యూటర్న్ కోసం పై వంతెన నిర్మించి ఈ సమస్యకు చెక్ పెట్టింది
చెన్నైలోని ప్రముఖ శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
చెన్నై విమానాశ్రయం లో ప్రయాణికుల లగేజీతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు 24 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
తమిళనాడులోని చెన్నైలో భయానక ఘటన వెలుగు చూసింది. దేవుడు చెప్పాడంటూ కమల్ ఉస్మాన్ అనే వ్యక్తి సెంథిల్ కుమార్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆపై రక్తం కారుతున్న కత్తి పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహిళలతో చాటింగ్ చేస్తున్న కారణంగా అతన్ని దేవుడు చంపేయమన్నాడని, అందుకే చంపానంటూ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు.
తిరుమల అంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జలకరించాల్సిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే శ్రీవారి భక్తులకు వణికిపోవాల్సిందే. తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈమధ్య చిరుతలు, ఎలుగుబంట్లు, ప్రాణపోయిన సందర్భాలను చూశాం. తిరుమలకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి వస్తామా..!! అనే భయం శ్రీవారి భక్తులకు వస్తోంది. తాజాగా మరో ఘటనతో తిరుమలలో కలకలం రేపుతోంది.