Big breaking:ఛత్తీస్ ఘడ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు
సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు , భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు , భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజర్యయారు. అలాగే ఈరోజునే ఛత్తీస్‌గడ్‌లో విష్ణు దేవ్ సాయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని సీఎంగా నియమించింది. అలాగే అరుణ్ సావో, విజయ్ శర్మలను డిప్యుటీ సీఎంలుగా ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మూడుసార్లు సీఎంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది.
ఛత్తీస్‌గడ్‌కు సీఎం ఎవరో అనే ఉత్కంఠకు తెర పడింది. విష్ణుదేవ్ సాయ్‌ను బీజేపీ అధిష్ఠానం సీఎంగా ప్రకటించింది. మరో కీలక నేత రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ విష్ణుదేవ్ సాయ్కు అవకాశం ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడైన అసిమ్ దాస్ తండ్రి సుశీల్ దాస్ (62) అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం తన స్వగ్రామంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయడం మరో పెద్ద తతంగంగా మారిపోయింది బీజేపీకి. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ప్రధాని మోదీ తన నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాలతో మంగళవారం అర్ధరాత్రి దాకా ఈ వ్యవహారంపై చర్చించారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారనేది వేచి చూడాల్సిందే
ఛత్తీస్‌గఢ్ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం 11 గంటల సమయానికి బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అక్కడ 52 స్థానాల్లో బీజేపీ.. కాంగ్రెస్ 37 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.