నేషనల్ Chandrayaan-3 Success Meet : అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో...!! ఆగస్టు 23న, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగం ఉపరితలంపై విజయవంతంగా దిగింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. 7 సెప్టెంబర్ 2019 చంద్రయాన్ -2 విఫలమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి ఇస్రో ఛైర్మన్ కె. శివన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్బంలో ప్రధాని మోదీ ఆయన్ను కౌగిలించుకుని ఓదార్చిన క్షణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. మీరు కన్న కలలు త్వరలోనే సాకారం అవుతాయని ప్రధాని మోదీ ఓదార్చిన తీరు యావత్ ప్రజలను కంటతడి పెట్టించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో ఇస్రోలోకి అడుగుపెట్టారు మోదీ. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi ISRO Visit : ఇస్రోలో ప్రధాని మోదీ... బృందాన్ని అభినందించిన ప్రధాని..!! చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ను కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA’s First Moon Walk: వావ్...జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపైకి ఎలా నెమ్మదిగా దిగిపోతుందో ఈ వీడియోలో చూడవచ్చు.ఇస్రో ట్విట్టర్ లో చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుండి దిగిపోయిందని, జాబిల్లిపై భారత్ నడిచందని ఇస్రో పోస్టు చేసింది. చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: చంద్రయాన్-3 ఫొటో తీసిన చంద్రయాన్-2...వాట్ ఏ మిరాకిల్ బ్రో..!! ఇస్రో మరో కొత్త చిత్రాన్ని షేర్ చేసింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్‌ను ఫొటో తీసి చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఎలా ఉన్నాడో చూశారా.. మస్ట్ వాచ్ వీడియో భయ్యా! ఇస్రో నుంచి చంద్రయాన్-3 విషయంలో ఎలాంటి అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు చంద్రుడు ఎలా కనిపించాడో ఓ ఫుటేజీని ఇస్రో ట్విట్టర్లో షేర్ చేసింది. మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. ఆ ప్రాంతం తమ పరిశోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉందన్నారు. చంద్రుడిపై మానవుడు నివసించడానికి వీలైన ఆవాస యోగ్య ప్రదేశాలను గుర్తించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: గూగుల్ నుంచి అమూల్ వరకు.. చంద్రయాన్ సక్సెస్‌కి యాడ్ ప్రపంచం ఫిదా..! చంద్రయాన్-3 సక్సెస్‌ని యాడ్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటోంది. గూగుల్, అమూల్, కోకా కోలా, స్విగ్గీ, టాటా క్లిక్, బ్రూక్‌ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చంద్రయాన్-3పై స్పెషల్ యాడ్స్ క్రియేట్ చేశాయి. వీటిలో మల్డినేషనల్ యాడ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అటు సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం లాంటి అంశాలను ల్యాండర్ అధ్యయనం చేస్తోంది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తోంది. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!! ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!! చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ జాబిల్లిపై రోవర్ ప్రయాణం.. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం..!! చంద్రయాన్-3 జాబిల్లిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయ్యింది. ర్యాంప్‌పై ల్యాండర్ నుండి రోవర్ బయటకు వస్తున్న మొదటి ఫోటోను అంతరిక్ష నౌక తీసింది. అంతకుముందు, చంద్రయాన్-3 ద్వారా క్లిక్ చేసిన చంద్రుని ఉపరితలం ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn