Big Breaking: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..
చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు.. నేడు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ సైతం ముగియనుంది.
ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ రోజు నారా లోకేష్ రాజమండ్రి జైలులో కలవనున్నారు. చంద్రబాబుతో కోర్టు విచారణ విషయాలను చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పూర్తి కథనం కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాదులు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదన్నారు. బాబు హెల్త్ పై నిత్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.