Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్డేట్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు.
స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జడ్జి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ కానుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతిలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి.. సీఐడీ బెదిరింపులకు భయపడేదే లేదంటూ సీఐడీకే సవాల్ విసిరారు భువనేశ్వరి. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు.
‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె నేరుగా స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. ఈ రోజు తమ కులదైవనికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి స్వగ్రామంలోనే బస చేసి రేపటి నుంచి మొదటి విడతగా మూడు నియోజకవర్గాలలో మూడు రోజులపాటు బస్సుయాత్ర చేయనున్నారు. యాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.