AP Politics: హమాస్ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
చంద్రబాబుకు కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనారోగ్య కారణంగా జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆయన.. జైలు బయట ప్రసంగించండం సీఐడీకి ఆయుధంగా మారింది. కోర్టు నిబంధనల ప్రకారం.. ఆయన మీడియాతో మాట్లాడటం, ప్రసంగించడం చేయొద్దు. కానీ, ఆయన జైలు బయట ప్రసంగించారు. దీనిని సీఐడీ సీరియస్గా తీసుకుంది. దీని ఆధారంగా బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
చంద్రబాబుకి బెయిల్ రావడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని..అందరం ఆయనను స్వాగతిద్దాం అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని సెటైర్లు వేశారు.
ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు విడుదల అవుతారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒక వేళ ఆలస్యం అయితే.. రేపు ఉదయం విడుదల అవుతారని వెల్లడించారు. భవిష్యత్ లో మిగతా అన్ని కేసుల విషయంలోనూ చంద్రబాబుకు తప్పుకుండా ఊరట లభిస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. బాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది.