Breaking: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జడ్జి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ కానుంది.
స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జడ్జి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ కానుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతిలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి.. సీఐడీ బెదిరింపులకు భయపడేదే లేదంటూ సీఐడీకే సవాల్ విసిరారు భువనేశ్వరి. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు.
‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె నేరుగా స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. ఈ రోజు తమ కులదైవనికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి స్వగ్రామంలోనే బస చేసి రేపటి నుంచి మొదటి విడతగా మూడు నియోజకవర్గాలలో మూడు రోజులపాటు బస్సుయాత్ర చేయనున్నారు. యాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు.
నిన్న న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా గెలుస్తుంది అంటూ ఓ లేఖ బయటకు వచ్చింది. చంద్రబాబే ఈ లేఖను రాసినట్టు చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ లేఖను బాబు రాయలేదని...అది ఎవరో సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు.
చంద్రబాబు ప్రజల మనిషని, ఎల్లప్పుడూ జనాల కోసమే పని చేశారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తన తండ్రి గురించి చెబుతూ లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు తనను, తన తల్లిని, భార్యను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది.