కేంద్ర ప్రభుత్వానికి కేశినేని నాని లేఖ!
టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం అని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని బాలకృష్ణ మండిపడ్దారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని కొనియాడారు. ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయన వివరణ ఇస్తారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటిసులు ఇవ్వడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ నిర్మాణ సంస్థ నుంచి రూ. 118 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబుకు నోటిసులు అందాయి. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశామే లేదని..ఇదంతా వైసీపీ నేతల కుట్ర అని ఆరోపించారు.
ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సమస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను.. ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోగస్ సభ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు.
జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరదం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.