TDP: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్ గుడ్‌బై!
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
టీడీపీతో కలిసి పనిచేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు అడిగారని అయితే అది కుదరదని చెప్పినట్టు తెలిపారు. తన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్లే విజయవాడ వెళ్లానని బాంబు పేల్చారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
గుడివాడ సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
గుడివాడలో పొటికల్ గొడవ మొదలైంది. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఇద్దరూ ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం ధర్మాసనం వేర్వేరు తీర్పులిచ్చింది. చివరికి ఈ కేసును సీజేఐకు బదిలీ చేస్తూ జస్టీస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఓటరు జాబితాపై మిస్టేక్స్ తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు.
తిరువూరు టీడీపీ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలిరాగా.. అక్కడ తారక్ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో జూనియర్ ఫ్యాన్‌ను టీడీపీ కార్యకర్త కొట్టాడు.