KCR:యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. యశోదలో డిసెంబర్ 8న ఆయనకు తుంటి మార్పిడి సర్జరీ జరిగింది. దీని నుంచి కోలుకున్న కేసీఆర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. యశోదలో డిసెంబర్ 8న ఆయనకు తుంటి మార్పిడి సర్జరీ జరిగింది. దీని నుంచి కోలుకున్న కేసీఆర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం నాడు యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్తారు.
తెలంగాణలో గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారు. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్ కానున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు.
కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ చికిత్స అనంతరం డాక్టర్ల సాయంతో వాకర్ తో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ క్రమంగా కోలుకుంటుండడంతో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ గా స్పందించారు.
మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యలయంలో ఫైల్స్ మాయమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపించకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండగులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు అప్డేట్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఈరోజు కేసీఆర్ నడవగలుగుతున్నారని అన్నారు. మరికొన్ని రోజులు కేసీఆర్ కు రెస్ట్ అవసరమని తెలిపారు
రైతు బంధు నిధుల విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పెద్ద ఫామ్ హౌస్ లకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీష్ రావు బాదపతున్నారని చురకలు అంటించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పులకుప్పగా చేసిందని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా.. 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 8 మంది సభ్యులు సభకు రాలేదు.