BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
నల్గొండలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వెంటనే కూల్చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు.
వరంగల్‌లో బీఆర్ఎస్కు మరో బిగ్‌షాక్ తగిలింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో వీళ్లు కాంగ్రెస్‌లోనే పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు.
తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ గురువారం పార్టీ కార్యకర్తలతో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది పార్టీని వీడినంత మాత్రానా ఎలాంటి తేడా జరగదని అన్నారు. నాడు ఎన్టీఆర్ తిరిగి ఎలా అయితే ప్రజల గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ CM పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశిస్తూ CM అంటే 'కటింగ్ మాస్టరా?' అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. రెండు లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.