BREAKING: గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి!
ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గుజరాత్ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.
గుజరాత్లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వంతెన కుప్పకూలింది. వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు.
మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. చాలాఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇనుప వంతెన తుప్పుపట్టడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు.
పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చైనాలో ఆకస్మిక వరదల కారణంగా.. షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఓ వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయలపాలయ్యారు. అలాగే వంతెన కింద ఉన్న నదిలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.