Bandi Sanjay: కేటీఆర్.. నీకెంత కండకావరం?... బండి సంజయ్ ఫైర్!
మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేటీఆర్.. నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… తిడతావా అని ఫైర్ అయ్యారు. కేఏ పాల్ తమ్ముడు గంగుల కమలాకర్ అని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేటీఆర్.. నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… తిడతావా అని ఫైర్ అయ్యారు. కేఏ పాల్ తమ్ముడు గంగుల కమలాకర్ అని విమర్శించారు.
మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్.. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలనుకుంది సీఎం కేసీఆరేనని ఆరోపించారు. మేం వార్నింగ్ ఇస్తేనే ఆయన వెనకడుగు వేశారని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదముందన్నారు.
వేములవాడను వారణాశి తరహాలో అభివృద్ధి చేస్తామని ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. రూ. 400 కోట్లతో వేములవాడను తీర్చిదిద్దుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ఇక్కడి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సర్వే ఫలితాలను తారుమారు చేస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రంగస్థలం సినిమా స్టోరీతో అధికార పార్టీని ఓ ఆటఆడుకున్నారు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండిసంజయ్. నారాయణఖేడ్ లో సామాన్యుడికి, ఆసాములకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. మీకు ఏం జరిగినా సంగప్ప ఉన్నాడు..సంగప్పకు ఏం జరిగినా నేనున్నా...నాకేం జరిగినా మోదీ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికల వేళ గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అక్రమంగా సంపాధించిన ఆస్తులు ఏమున్నాయో నిరూపిస్తే.. వాటిని కరీంనగర్ ప్రజలకు పంచేందుకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.
మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్ అవినీతిలో టాప్ ప్లేసులో నిలిచిందని అన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి గంగుల అంటూ ఫైర్ అయ్యారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం.. సీఎం.. అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. మీరు సీఎం అని అనడం వల్లే తన పదవి పోయిందని అన్నారు. దయచేసి సీఎం అంటూ నినాదాలు చేయవద్దని బీజేపీ కార్యకర్తలను కోరారు.
తెలంగాణలో ఎన్నికల వేళ రోజురోజుకు ఆసక్తికర సన్నివేశాలు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజమ్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల అఫిడవిట్లో తనకు సొంతిల్లు కానీ, ఎక్కడా భూమి కానీ లేదని పేర్కొన్నారు బండి సంజయ్. అటు రేవంత్రెడ్డి ఆస్తులు ఈ ఐదేళ్లలో రూ.5కోట్లు పెరిగింది. బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి ఆస్తులు ఈ ఐదేళ్లలో 58శాతం పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.