Varanasi : శివశివా.. కాశీలో 21 మంది నకిలీ పూజారుల అరెస్టు
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో కేసు నమోదైంది.
మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని బెంగుళూర్లో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి.
25 మందిని మోసం చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారైన ఓ నిత్య పెళ్లికూతురిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈమె బారినపడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు పలికిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 42కి చేరుకుందన్నారు.
పాకిస్తాన్లోని ఏజెన్సీలతో కుమ్మకై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ప్రకారం అరెస్టయిన వ్యక్తులు పాలక్ షేర్ మాసిహ్ , సూరజ్ మాసిహ్ గా గుర్తించారు.
వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.