Big Breaking: వైసీపీకి బిగ్ షాక్..క్రికెటర్ అంబటి రాయుడు అవుట్
వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాడు క్రికెటర్ అంబటి రాయుడు. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ ట్వీట్ చేశాడు.
వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాడు క్రికెటర్ అంబటి రాయుడు. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ ట్వీట్ చేశాడు.
వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తనకు మల్లకార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నుంచి అధికారిక సమాచారం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారన్నారు.
వైసీపీలో మరో ఎమ్మెల్యే రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌తో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. పవన్, నాదెండ్ల మనోహర్‌తో గంటపాటు చర్చలు జరిపారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీఎం జగన్ తో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రేపు వైసీపీ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఫైనల్ అవుతుందని చెప్పారు.
టీడీపీ అధినేతను ప్రశాంత్‌కిశోర్ కలవడంతో ఆయన ఐపాక్ టీమ్ ఇక నుంచి టీడీపీకి పనిచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే 2024లో జగన్ మళ్లీ ఘనవిజయం సాధిస్తారని.. తమ పనిపట్ల అంకితభావంతో ఉన్నామని ఐపాక్ టీమ్ ట్వీట్ చేసింది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.