Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల సమీపంలో మరో చిరుత ప్రత్యక్షమైయింది. గత మూడు రోజులుగా గోశాల సమీపంలో ఈ చిరుత సంచరిస్తున్నట్ల ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తిరుపతి జూపార్క్‌కు తరలించారు.
మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్‌పై దాడి జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరత్ చెప్పారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను.. ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపోతంపై తీసుకొనే నిర్ణయాలపై వారు చర్చించారు.
అల్లూరి సీతారామారాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు వంతల కావ్యశ్రీ (13), సాహితీ(10)గా పోలీసులు గుర్తించారు.
తెలుగు చలనచిత్ర హీరోల్లో పేరుగాంచిన వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంకు ఎన్టీఆర్ కు సంబంధమేమిటని మీడియాలో విరుచుకుపడ్డారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరులో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది.